రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలంలోని పంట పొలాలకు వెళ్లే రోడ్ల మరమ్మత్తులకు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షకిల్ ఆమీర్ ఆదేశాల మేరకు రోడ్డు మరమ్మతు పనులకు స్థానిక నాయకులు శ్రీకారం చుట్టారు. బందల్ల రోడ్డు పై మొరం పనులు చేపట్టి ఆ తర్వాత కంకర వేయనున్నట్లు వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఫిక్, రెంజల్ సింగిల్ విండో మాజీ చైర్మన్ ప్రశాంత్, డైరెక్టర్ అగు నారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు అంజయ్య, సాయ గౌడ్, స్థానిక రైతులు పాల్గొన్నారు.