ఆరోగ్య కార్యకర్తలను రెగ్యులర్ చేయాలని తహశీల్దార్ కు వినతి పత్రం

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత.....
తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత…..
నవతెలంగాణ రెంజల్
రెంజల్ మండలంలో గత పది సంవత్సరాలుగా ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్ చేయాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ రామచందర్ మంగళవారం అందజేశారు. రాత్రనకా, పగలనకా, వైద్య సేవలను నిరంతర అందిస్తున్న తమకు గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే రెగ్యులర్ చేయాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు కళావతి, జమున, శ్యామల, శోభ, వసంత తదితరులు పాల్గొన్నారు.