
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం జవహర్ లాల్ తండ గ్రామంలోని బంగి రెడ్డి తండాలో హైమస్ లైట్ ను మంగళ వారం ఎంపిటిసి బానొతు పద్మ ప్రారంభించి లక్ష రూపాయల ఎంపీటీసీ నిధులతో హైమస్ లైట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తండ ప్రజల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. తండ ప్రజలు ఎంపీటీసీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు తండా ప్రజలు పాల్గొన్నారు.