కివీస్‌కు బుమ్రా!

ముంబయి : భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా త్వరలోనే న్యూజిలాండ్‌కు బయల్దేరనున్నాడు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఈ ఏడాది ఐపీఎల్‌ సహా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా గాయం దృష్ట్యా అతడికి న్యూజిలాండ్‌లో శస్త్రచికిత్స చేయించనున్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ రోవాన్‌ గతంలో జోఫ్రా ఆర్చర్‌, షేన్‌ బాండ్‌లకు సైతం వెన్నునొప్పి గాయాలకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుత ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ సూచనతో బుమ్రాకు కివీస్‌ డాక్టర్‌ దగ్గర చికిత్స చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. సర్జరీ అనంతరం బుమ్రా 20-24 వారాలు ఆటకు దూరం కానున్నాడు. ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు అందుబాటులో ఉండేలా బుమ్రా పునరాగమనాన్ని బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది.