త్రిబుల్ ఐటీ విద్యార్థిని అనారోగ్యంతో మృతి

నవతెలంగాణ- రాజంపేట్
మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన అంకం నేహ శ్రీ (21) త్రిబుల్ ఐటీ విద్యార్థిని బుధవారం అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందింది. నేహ శ్రీ ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతుంది.విద్యార్థిని నేను చదువులో ముందంజలో ఉండేదని గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూ కలిసిపోయేదని నేహా శ్రీ మృతితో ఆరేపల్లి గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది.