
రెంజల్ ఎంపీపీ రజిని కిషోర్, వైస్ ఎంపీపీ యోగేష్ లపై గురువారం ఎంపీటీసీలు బోధన్ ఆర్డీవో రాజా గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ప్రభుత్వ పథకాలను సైతం ప్రజల్లో తెలియజేయకుండా వారిష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో, తాము వ్యక్తిగతంగా అవిశ్వాసానికి మద్దతు ఇచ్చామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చింతకుంట లక్ష్మి, అసాద్ బేగ్, ఎస్.కె అహమ్మద్, ఈదగంగలత, అజ్మల్ ఉన్నిసా తదితరులు ఉన్నారు.