– జాన్ కైపర్స్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వైద్యసేవలు బాగున్నాయని నెదర్లాండ్స్ వైద్యారోగ్యశాఖ మంత్రి జాన్ కైపర్స్ కితాబిచ్చారు. గురువారం ఆయన తన ప్రతినిధులతో కలిసి నిమ్స్‌లోని క్యాన్సర్, యూరాలజీ విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్ట గురించి విని స్వయంగా చూసేందుకు వచ్చినట్టు తెలిపారు.