గోదావరిలో పుణ్య స్థానాల ఆచరించిన భక్తులు..

నవతెలంగాణ- రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో ఆదివారం భక్తుల అత్యధిక సంఖ్యలో విచ్చేసి తమ మొక్కలను తీర్చుకున్నారు. గోదావరిలో పుణ్య స్థానంలో ఆచరించి తేప్పలను విడిచారు. కుల మతాలకతీతంగా ముస్లిం మహిళలు తీపి వంటలను తయారు చేసి తమ మొక్కలను తీర్చుకోవడం విశేషం. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు తెప్పలు తయారు చేసుకోవడానికి గడ్డి దొరకకపోవడంతో ఈ గ్రామానికి చెందిన మహిళ పోసాని తెప్పలను తయారు చేసి 30 నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొంది. ప్రస్తుతం గడ్డి దొరకకపోవడం తో తాను రైతుల వద్ద గడ్డిని కొనుగోలు చేసి తిప్పలు తయారు చేయనున్నట్లు ఆమె అన్నారు.