
రెంజల్ మండలం బాగేపల్లి ఉప సర్పంచ్ సుంకరి సుదర్శన్ బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమిర్ సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై ఈ పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన పత్రి సురేష్ బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు స్థానిక సర్పంచి వికార్ పాషా తెలిపారు. రెంజల్ మండలం కూనేపల్లి గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సర్పంచ్ రోడ్డ విజయ లింగం పేర్కొన్నారు..