అబ్బాపూర్ తాండలో ఘనంగా తీజ్ పండుగ

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని అబ్బాపూర్ తండాలో గిరిజన సంప్రదాయ పండుగ తీజ్ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పండగ సందర్భంగా గ్రామంలోని జగదాంబ ఆలయంలో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజులపాటు మొలకెత్తిన నవ ధాన్యాల నారును గిరిజన మహిళలు, యువతులు మరియు పిల్లలు తలపై ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.