
నవతెలంగాణ – ఊరుకొండ
పంట సాగులో ప్రధానమైన ప్రధమ భాగం విత్తన శుద్ధి అని.. విత్తన శుద్ధి ద్వారా అధిక పంట దిగుబడి వస్తుందని కెవికె పాలెం విద్యార్థులు అన్నారు. ఊరుకొండ మండల పరిధిలోని గుడిగానిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం విద్యార్థుల సమక్షంలో గ్రామ రైతులకు విత్తన శుద్ధి గూర్చి పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంటను తీసుకున్నట్టు అయితే మెట్ట నారు మల్లకు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బెండాజిమును తడితో పట్టించి ఆరబెట్టి నారు మడిలో చల్లుకోవాలి, అదే దమ్ము నారు మడులకు లీటరు నీటికి 1 గ్రాము కార్బెండాజీము కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, తరువాత మండే కట్టిన మొలకలను నారు మడిలో చల్లుకోవాలనీ, కిలో విత్తనాలకు లీటరు ద్రావణం సరిపోతుందనీ వారు తెలిపారు. నిద్రా వస్తను తొలగించడానికి లీటరు నీటికి, తక్కువ నిద్రావస్థ (2 – 3 వారాలు) ఉన్న విత్తనాలకైతే 6.3 మిల్లీ లీటరు, ఎక్కువ నిద్రావస్థ (4-5 వారాలు) ఉన్న విత్తనాలకైతే 10 మిల్లీ లీటరు గాడ నత్రికామ్లo కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి కడిగి మండే కట్టాలనీ సూచించారు. దీని వలన ప్రధాన పొలంలో సంభవించే పురుగుల బెడదను, నేల మరియు విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధులు అరికట్టవచ్చనీ తెలిపారు. విత్తన శుద్ధితో పంట దిగుబడిలో వృద్ధి సాధించవచ్చు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం పాలెం, గ్రామీణ వ్యవసాయ అనుభవ విద్యార్థులు అమూల్య, హరీష, అశ్విని శెట్టి, చందన, అశ్వియ సభ, తదితరులు పాల్గొన్నారు.