నవీపేట్ లో ఘనంగా నాగుల పంచమి

నవతెలంగాణ- నవీపేట్: మండలంలో నాగుల పంచమి సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సుభాష్ నగర్ ముత్యాలమ్మ ఆలయంలో మహిళలు, యువతులు మరియు పిల్లలతో కిటకిటలాడింది. పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించి సాంప్రదాయ బద్ధంగా పూజలు చేశారు. సోదరీమణులు సోదరుల కండ్లను పాలతో కడిగి మిఠాయిలు కనిపించారు.