తాడ్వాయి మండల కేంద్రంలో సంభరాలు

నవతెలంగాణ – తాడ్వాయి

తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం రోజున సాయంత్రం ప్రధాన రహదారిపై టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎమ్మెల్యేల లిస్టులో ఎల్లారెడ్డి నియోజకవర్గ బరిలో రెండవసారి జాజార సురేంద్రకు టికెట్ ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్ది మహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుగం సాయి రెడ్డి, గ్రామ సర్పంచ్ బండారు సంజీవులు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పోలీస్ గోపాలరావు, రైతుబంధు గ్రామ అధ్యక్షులు రామ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.