నవతెలంగాణ -ఆర్మూర్
మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్న జీవన్ రెడ్డికి టికెట్ కేటాయించటం పట్ల పట్టణంతో పాటు నూతన ఆలూరు మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో సోమవారం సంబరాలు మిన్నంటినాయి. టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించినారు.. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన సంబరాల కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డి, జడ్పిటిసి మెట్టు సంతోష్, ఎంపీపీ పస్క నరసయ్య, వైస్ చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు ఇట్టేడి నర్సారెడ్డి, కోన పత్రి కవిత కాశిరాం, గంగా మోహన్ చక్రు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆలూరు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ దమ్మాజీ శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి మండలంలోని పి ఫ్రీ, ఖానాపూర్, చేపూర్ తదితర గ్రామాల సర్పంచులు ఆశాపురం దేవి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి మోహన్, ఇందూరు సాయన్న ,సొసైటీల చైర్మన్ సోమ హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.