గజ్వేల్‌లో ఓడిపోతాననే..

– కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ – వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గజ్వేల్‌ ఓటర్లు తనను ఓడిస్తారనే అనుమానంతోనే కేసీఆర్‌ రెండో చోట పోటీ చేస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్‌ పదేళ్ల ప్రజావ్యతిరేక విధానాలే ఆయన ఓటమికి కారణమవుతున్నాయని తెలిపారు. ఆ నియోజక వర్గంలో కనీసం డబుల్‌ బెడ్‌రూమ్‌లు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. దళితబంధూ అందలేదని తెలిపారు.