
లక్నవరం ప్రధాన కాలువల లో ఒకటైన నరసింహుల కాలువ గండ్ల ను నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు రైతులతో మాట్లాడుతూ రైతులే ఒకరికి ఒకరు సమన్వయంతో నీటి కోసం కాల్వగండ్లను పోల్చుకుంటున్న విధానం బాగుందని అధికారులు అన్నారు. అయినా ఖర్చును సంబంధిత గుత్తేదారు ద్వారా రైతులకు చెల్లించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి వరదల శాఖ ఎస్ ఈ వెంకటేష్, డిఈ శ్రీనివాస్, ఏఈ ఉపేందర్ రెడ్డి లతోపాటు బుసాపురం సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య పాల్గొన్నారు. చంద్రయ్య గండ్లు పూడుచుతున్న విధానాన్ని రైతులు పడుతున్న కష్టాన్ని అధికారులకు వివరించారు.