ఓటరు నమోదుకు స్పెషల్ క్యాంపియన్ లు..

– తాహసిల్దార్ అల్లం రాజకుమార్

నవతెలంగాణ-గోవిందరావుపేట
01-10-2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరు గా నమోదు చేసుకోవాలని ఇందుకోసం స్పెషల్ ఓటరు నమోదు క్యాంపియన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ అల్లం రాజకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బూత్ సూపర్వైజర్లు బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ అల్లం రాజకుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయాల్సిన బాధ్యత బూత్ లెవెల్ అధికారులపై ఉందని అన్నారు. ఆగస్టు 26 ,27 మరియు సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలలో ఓటరు నమోదు కొరకు స్పెషల్ క్యాంపియన్లు నిర్వహిస్తున్ననామని అన్నారు. సెప్టెంబర్ 19వ తారీకు వరకు నూతన ఓటర్ల నమోదుకు ఆస్కారం ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జే మమత, ఆర్ ఐ లు రాజేందర్ సుధాకర్ బూత్ లెవెల్ అధికారులు సూపర్వైజర్లు పాల్గొన్నారు.