నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం నీల గ్రామపంచాయతీ రికార్డులను ఆడిట్ అధికారులు బుధవారం పరిశీలించారు. సంవత్సరానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆడిట్ అధికారి అమృత్ కుమార్ ఆధ్వర్యంలో పురుషోత్తం, రవికుమార్, సరితలు పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డును వారు పరిశీలించారు. వారి వెంట గ్రామ కార్యదర్శి బి. రాణి, కారోబార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.