– హిండ్‌వేర్ ఇటాలియన్ కలెక్షన్ “ఫాబియో”, “అగ్నీస్” అనే సొగసు, వినూత్నతను కలిగి ఉన్న రెండు కొత్త కుళాయిల శ్రేణిని ప్రారంభించినది.
– గేట్‌వే టు గ్రాండియర్ అనే ఈవెంట్ లో హిండ్‌వేర్ “థర్మోస్టాట్ డైవర్టర్స్” “మల్టీ-ఫంక్షన్ షవర్స్” యొక్క కొత్త శ్రేణిని ప్రదర్శించినది.
నవతెలంగాణ – హైదరాబాద్: ఐకానిక్ బాత్‌వేర్ బ్రాండ్ అయిన హిండ్‌వేర్ లిమిటెడ్, తన ఉత్పత్తి శ్రేణిలో వినూత్నమైన, వోగ్ కుళాయిల శ్రేణిని ప్రారంభిస్తున్నట్లు ఈరోజు ప్రకటించినది. కంపెనీ “ఫాబియో” మరియు “అగ్నీస్” అనే రెండు కొత్త కుళాయిల శ్రేణిని వెల్లడించినది, ఈ రెండూ సరికొత్త సాంకేతికతను మరియు గొప్ప స్టైల్ మరియు క్రియేటివిటీ గలవి. “గేట్‌వే టు గ్రాండియర్” ఈవెంట్ సందర్భంగా “థర్మోస్టాట్ డైవర్టర్స్” మరియు “మల్టీ-ఫంక్షన్ షవర్స్” యొక్క కొత్త శ్రేణిని బ్రాండ్ ఆవిష్కరించినది, ఇది ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడినది మరియు న్యూ ఢిల్లీ, లక్నో, ఇండోర్, రాంచీ మరియు బెంగళూరులో నిర్వహించబడినది. ఈ విస్తరణ లక్ష్యం వినియోగదారుని సౌకర్యాన్ని మెరుగుపరిచే ఒక సమీకృత పరిష్కారాన్ని అందించడం. ఇది మిడ్-ప్రీమియం మరియు ప్రీమియం వినియోగదారులను, ఆర్కిటెక్ట్స్, డీలర్స్ మరియు బిల్డర్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడినది. ఆవిష్కరణ సందర్భంగా శ్రీ సుధాంశు పోఖ్రియాల్, సిఇవో ఆఫ్ బాత్ అండ్ టైల్స్, హిండ్‌వేర్ లిమిటెడ్ గారు మాట్లాడుతూ, “ఆవిష్కరణ, సుస్థిరత, మరియు అద్భుతమైన డిజైన్ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబించే మా తాజా ఉత్పత్తి శ్రేణిని ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. “థర్మోస్టాట్ డైవర్టర్స్” మరియు “మల్టీ-ఫంక్షన్ షవర్స్” యొక్క కొత్త శ్రేణి ఇంటి వద్దనే మీకు స్పా-వంటి అనుభవాన్ని అందించును, అలాగే మా స్మార్ట్ టెక్నాలజీ ఉత్పత్తులు అనుకూలతను మరియు సౌకర్యాన్ని అందించును. విభిన్న శైలులు మరియు ప్రాధాన్యతలకు తగిన బాత్రూమ్ సొల్యూషన్స్ యొక్క వైవిధ్యమైన శ్రేణిని అందిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము, మరియు బాత్రూమ్ రంగంలో విలాసవంతమైన భావనను ఇకముందు కూడా మేము కొనసాగించాలనకుంటున్నాము.” అన్నారు. వినియోగదారుని ప్రవర్తనలో ఇటీవలి మార్పులు విలాసవంతమైన అనుభవాలపై అధికంగా దృష్టిసారించేలా చేశాయి, మరియు కొత్త ఉత్పత్తి శ్రేణి మారుతున్న అవసరాలను తీర్చడం మరియు సృజనాత్మక పనితీరు ఆధారిత ఉత్పత్తి పరిష్కారాలను అందించే బ్రాండ్ యొక్క లక్ష్యాన్ని కొనసాగించడం కోసం ఉద్దేశించబడినది.
థర్మోస్టాట్ డైవర్టర్స్: కొత్త హిండ్‌వేర్ థర్మోస్టాట్ డైవర్టర్స్ అనేవి నీటి ఉష్ణోగ్రతపై ఖచ్చితమైన నియంత్రణను అందించే మరియు ఓదార్పునిచ్చే మరియు సురక్షితమైన అనుభవానికి హామీ ఇచ్చేందుకు తెలివిగా రూపొందించబడిన ఫిక్చర్స్‌తో స్నానపు ప్రక్రియను మరింత మెరుగ్గా చేస్తాయి. పైగా, అవి బాత్రూమ్ అలంకరణకు సొగసైన టచ్‌ను జోడించే గోల్డ్, రోజ్ గోల్డ్ మరియు నలుపు వంటి అద్భుతమైన రంగులలో వస్తాయి.
మల్టీ – ఫంక్షన్ షవర్స్: హిండ్‌వేర్ అనేది మల్టీ – ఫంక్షన్ షవర్ తో, యుటిలిటీని సొగసుతో జోడించడం ద్వారా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తున్నది. ఈ షవర్స్ రేన్, మిస్ట్, మరియు కాస్కేడ్ సహా బహుళ ప్రవాహాలను అన్నింటినీ ఒకే యూనిట్ లో అందిస్తూ, మీ షవర్ అనుభవాన్ని మీరు పరిపూర్ణంగా అనుకూలీకరించుకునే వీలు కల్పించును. గోల్డ్, రోజ్ గోల్డ్ మరియు నలుపు వంటి అద్భుతమైన రంగులలో లభించే ఈ షవర్స్ విలాసానికి ప్రతీకగా నిలుస్తాయి.
ఫాబియో: హిండ్‌వేర్ నుండి వస్తున్న తాజా కుళాయి శ్రేణి, ఫాబియోతో సమకాలీన శైలిని జోడించిన ఒక కొత్త కుళాయి శ్రేణి. డిటేల్ పట్ల ఖచ్చితమైన శ్రద్ధతో రూపొందించబడి, ఫాబియో సొగసు మరియు వినూత్నతను జోడిస్తూ మీ బాత్రూమ్ స్థలం యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
అగ్నీస్: చిరకాల సౌందర్యం మరియు క్లాసిక్ ఆకర్షణను ఆవిష్కరిస్తూ దాని మచ్చ లేని డిజైన్ మరియు గొప్ప నైపుణ్యంతో ఒక కొత్త కుళాయి శ్రేణి అగ్నీస్ అనేది విలాసాన్ని ప్రతిబింబిస్తుంది. విశిష్ట అతిథులెందరో “గేట్‌వే టు గ్రాండియర్” ఈవెంట్ కు హాజరయ్యారు, వారిలో హిండ్‌వేర్ యొక్క CEO మరియు బిజినెస్ హెడ్ కూడా ఉన్నారు, వీరు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆవిష్కరణ మరియు వినియోగదారుల సంతృప్తి పట్ల కంపెనీ యొక్క అంకితభావాన్ని వివరించారు. 3000లకు పైగా ఛానెల్ భాగస్వాములు ఈ అత్యాధునిక ట్యాప్ లైన్స్ పరిచయం చేయుటను చూసేందుకు ఒక అద్భుత అవకాశంగా ఈ ఈవెంట్ ను ఉపయోగించుకున్నారు. ఈ ఈవెంట్ ను అనేక ప్రదేశాలలో ప్లాన్ చేయడం హిండ్‌వేర్ కు చాలా సంతోషం కలిగించినది దీని వల్ల ఎక్కువ మంది భాగస్వాములు ఈ సరదా కార్యక్రమంలో పాలుపంచుకోగలిగారు మరియు ఈ వస్తువులను మొదటిసారి ప్రత్యక్షంగా ఉపయోగించగలిగారు.
హిండ్‌వేర్ లిమిటెడ్ గురించి
ఐకానిక్ బ్రాండ్ అయిన హిండ్‌వేర్ యొక్క రూపకర్తలు అయిన హిండ్‌వేర్ లిమిటెడ్ అనేది దేశంలోనే ప్రముఖ నిర్మాణ ఉత్పత్తుల కంపెనీ. Queo – ద లగ్జరీ బ్రాండ్, హిండ్‌వేర్ ఇటాలియన్ కలెక్షన్, మరియు హిండ్‌వేర్ – ద ప్రీమియం బ్రాండ్స్ వంటి వాల్యూ చైన్ వ్యాప్తంగా ప్రముఖ వినూత్నమైన బ్రాండ్స్ అందించే బలమైన పోర్ట్ ఫోలియోతో విస్తృత శ్రేణి వినియోగదారులకు సేవలందించే అత్యుత్తమ శ్రేణి బాత్‌వేర్ ఉత్పత్తుల యొక్క ఒక బహుముఖ శ్రేణిని హిండ్‌వేర్ కలిగి ఉంది. హిండ్‌వేర్ లిమిటెడ్ అనేది ‘హిండ్‌వేర్ ఇటాలియన్ టైల్స్’, ‘ట్రూఫ్లో బై హిండ్‌వేర్’, నిర్మాణ రంగానికి సేవలందించే PVC, CPVC, UPVC, SWR పైపుల వంటి వాటిని కలిగి ఉండే ప్లాస్టిక్ పైపులు మరియు ఫిట్టింగ్స్ వ్యాపారాలను కూడా కలిగి ఉంది.