బుడాపెస్ట్(హంగరీ): ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్లోకి భారత అథ్లెట్ జాస్విన్ అడ్రిన్ ప్రవేశించాడు. బుధవారం జరిగిన పోటీల్లో జాస్విన్ 8మీటర్లు జంప్ చేసి 12వ స్థానంలో నిలిచాడు. దీంతో కటాఫ్ జంప్‌కు చేరి ఫైనల్లో చోటు దక్కించుకున్నాడు. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో ఫైనల్లో చోటు దక్కించుకున్న తొలి అథ్లెట్ జాస్విన్ మాత్రమే. ఇక ఒలింపియన్ మురళీ శ్రీశంకరన్ లాంగ్‌జంప్ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాడు.