కీటో మోటార్స్‌, సైరా ఎలక్ట్రిక్‌ జట్టు

హైదరాబాద్‌ : మూడు చక్రాల విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ కీటో మోటార్స్‌ కొత్తగా సైరా ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు తెలిపింది. దీంతో ఎలక్ట్రిక్‌ 3 వీలర్‌ (ఇ3డబ్ల్యుటి) మార్కెట్‌లో కీలకమైన పాత్ర పోశించాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. తమ ఈ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్ల (ఇ రిక్షా) రూపకల్పన, తయారీ, రిటైలింగ్‌లో సైరా ఎలక్ట్రిక్‌ నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా ఇవి మార్కెట్‌లో గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్వాసం వ్యక్తం చేసింది.