ఆయుష్ ఆధర్వంలో కరపత్రాలు పంపిణి

నవతెలంగాణ -కోటగిరి
ఆయుష్ విభాగ వైద్యాధికారి ప్రేమలత ఆధ్వర్యంలో గురువారం పోతంగల్ ప్రైమరీ పాఠశాల సందర్శించి, పిల్లలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ,చిన్న చిన్న సమస్యలు ఉన్న వారికి ఆయుర్వేదిక్ మందులు పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు, పోషకహారం లోపంతో ఉన్న పిల్లలకు కౌన్సిలింగ్ చేసి ,ఆకుకూరలు ఎక్కువగా తినాలని తెలియ చేశారు . అనంతరం ఆయుష్ విభాగనికి సంబంధించిన కరదీపిక లు , పిల్లలకు ఉపాధ్యాయులకు అందచేశారు ఈ కార్యక్రమం నందు మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్, ఆయుష్ విభాగం ఫార్మసీస్ట్ పురుషోత్తం,స్థానిక ఆరోగ్య కార్యకర్త గౌరీదేవి, పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతి, ఉపాధ్యాయులు స్రవంతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.