ఉపాధ్యాయుల కొరత అనర్ధదాయకం: మాజీ జెడ్పిటిసి శంకర్

నవతెలంగాణ- కోటగిరి
కోటగిరి మండల కేంద్రంలో గురువారం మాజీ జెడ్పీటీసీ శంకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలములో ఎక్కడలేని విధంగా ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత  విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తుందని ఎప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదని సుంకిని, ఏత్తోండ గ్రామాలలో ముఖ్యంగా టీచర్ల కొరత తీర్చాలని పాఠశాలలో తెరిచి సుమారు మూడు నెలలుగా వస్తున్న ఇప్పటివరకు ఉపాధ్యాయులు లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర దేశాయ్, మాజీ ఎంపీపీ గందప  పవన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ తదితరులు పాల్గొన్నారు.