– మరో కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్
ముంబయి : మారియట్ బోన్‌వారుతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే తొలి కో-బ్రాండ్ హోటల్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ‘మారియట్ బోన్‌వారు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్’తో డిస్కవర్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగమైన డైనర్స్ క్లబ్ ద్వారా పని చేస్తుందని ఆ బ్యాంక్ పేర్కొంది. దేశంలో అత్యంత రివార్డింగ్ ట్రావెల్ కార్డ్‌లలో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఆవిష్కరించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేమెంట్ బిజినెస్, డిజిటల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ పరాగ్ రావు పేర్కొన్నారు.