కర్కా గణేష్ కు  డాక్టరేట్…

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి డాక్ట రేట్ను కర్క గణేష్  సాధించారు. డాక్టర్ జి.లలిత సూపర్వైజర్  గా ” ఎఫెక్ట్ ఆఫ్ సింటరింగ్ మెథడాలజీ ఆన్ స్ట్రక్చరల్, మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపోసిట్ ఫెర్రైట్స్” అనే అంశంపై పరిశోధన చేయడం జరిగింది.ఈ  వైవా వోస్ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్  శ్రీనాథ్ రెడ్డి ఎక్స్టర్నల్ ఎగ్జామినేర్ గా హాజరై సిద్ధాంత గ్రంథం లక్ష్యాలను అనువర్తితాలను  సమగ్రంగా చర్చించి అనేక ప్రశ్నలు సంధించి జవాబులు రాబట్టారు.కర్క గణేష్ నిజామబాద్ రూరల్ లోని సిరికోండ మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన విద్యార్థి. గడ్కోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి,కామధేను జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి, గిరి రాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని, తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసుకుని, మొట్టమొదటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో డాక్టరేటు పొందడం విశేషం.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సైన్స్ డీన్ ప్రొఫెసర్ సిహెచ్.అరతి, కళాశాల ప్రిన్సిపల్, ఫిజిక్స్ విభాగధిపతి డాక్టర్ ఎల్. హరిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. మోహన్ బాబు, డాక్టర్ పిట్ల సరిత, వైశాలి, దిలీప్, టీచింగ్, నాన్ టీచింగ్, పరిశోధక విద్యార్థులు  పాల్గొన్నారు.