నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, చిట్యాల గ్రామాలలో శుక్రవారం బాధితులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజివాడి గ్రామంలో పట్నం బాలరాజవ్వ, రాజేశ్వరరావులకు, చిట్యాల గ్రామంలో బాధితులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ….నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూషణం, శాంతాబాయి నారాయణ రావు, గోపాల్ రావు, చిట్యాల సర్పంచ్ కవితా బాలయ్య, ఎంపిటిసి రాజమణి రవీందర్, నాయకులు మహిపాల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు