వీఆర్వో వ్యవస్థ రద్దు కేసు 20కి వాయిదా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విఆర్‌ఓ వ్యవస్థ రద్దు చట్ట ప్రకారమే జరిగిందని, విఆర్‌ఒలుగా చేసే వారిని వేరే ప్రభుత్వ శాఖల్లో సర్ధుబాటు చేశామనీ, 60 మంది విఆర్‌ఓలు మాత్రమే రెవెన్యూ శాఖలో కొనసాగించాలని కోరుతున్నారని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విఆర్‌ఓలను ఇతర శాఖల్లోకి పంపడం అన్యాయమంటూ దాఖలైన పలు రిట్లను ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది. పిటిషన్లను కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. పిటిషనర్ల వాదనలను ఈ నెల 20న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది.