కోపెన్‌హాగన్ : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో వరల్డ్ నం.2 సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పతక వేటకు తెరపడింది. పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ నిరాశపరిచింది. రెండో సీడ్ మన షట్లర్లు.. క్వార్టర్స్‌లో 11వ సీడ్ డెన్మార్క్ షట్లర్లు కిమ్, ఆండర్స్ చేతిలో వరుస గేముల్లో ఓటమి పాలయ్యారు. 18-21, 19-21తో సాత్విక్, చిరాగ్‌లు అనూహ్య ఓటమి చవిచూశారు.