చాంపియన్‌ భారత్‌ ఐబిఎస్‌ఏ వరల్డ్‌ గేమ్స్‌

బర్మింగ్‌హామ్‌ : ఇంటర్నేషనల్‌ బ్లైండ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐబిఎస్‌ఏ) వరల్డ్‌ గేమ్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో 114/8 పరుగులే చేసింది. వర్షం అంతరాయంతో భారత్‌ లక్ష్యాన్ని 9 ఓవర్లలో 42 పరుగులుగా నిర్ణయించారు. 3.3 ఓవర్లలోనే 43/1 పరుగులు చేసిన భారత అమ్మాయిలు విజేతలుగా నిలిచారు.