న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియాలో భద్రత లోపాలను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించింది. ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం అంతర్గత భద్రతా ఆడిట్లలో లోపాలను గుర్తించింది. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు. 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్‌లైన్ తప్పుడు నివేదికలు సమర్పించిందని సమాచారం. సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా పేర్కొంది.