శ్రీలంక ముందంజ

– న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 162/5
క్రైస్ట్‌చర్చ్‌ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో లంకేయులు కదం తొక్కుతున్నారు. బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనలతో తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగుల భారీ స్కోరు సాధించిన శ్రీలంక.. పేసర్ల మెరుపులతో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తోంది. పేసర్లు ఫెర్నాండో (2/42), లహిరు కుమార (2/34) నిప్పులు చెరగటంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 162/5తో ఎదురీదుతోంది. ఓపెనర్లు టామ్‌ లేథమ్‌ (67, 144 బంతుల్లో 7 ఫోర్లు), డెవాన్‌ కాన్వే (30, 88 బంతుల్లో 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 67 పరుగులతో శుభారంభం అందించినా.. మిడిల్‌ ఆర్డర్‌ను లంక పేసర్లు వణికించారు. కేన్‌ విలియమ్సన్‌ (1), హెన్రీ నికోల్స్‌ (2), టామ్‌ బ్లండెల్‌ (7)లు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. డార్లీ మిచెల్‌ (40 బ్యాటింగ్‌, 89 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), మైకెల్‌ బ్రాస్‌వెల్‌ (9 బ్యాటింగ్‌) అజేయంగా ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 193 పరుగుల వెనుకంజలో నిలిచింది.