నేత్రదానం పై అవగాహన సదస్సు

నవతెలంగాణ జమ్మికుంట
జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలలో భాగంగా జమ్మికుంట లోని వర్తక సంఘం కమ్యూనిటీ హాల్ లో శిక్షణ పొందుతున్న యోగా మిత్రులకు సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నరహరి నేత్ర,అవయవ, శరీర దానాలపై సోమవారం అవగాహన  కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .దేశంలో 14 లక్షల మంది కార్నియల్ అంధులు చీకటి జీవితాలను అనుభవిస్తున్నారని వారిలో 60 శాతము మంది 12 సంవత్సరాల లోపు బాల బాలికలు ఉండడం విచారకరమన్నారు .దీనిని దృష్టిలో పెట్టుకొని  కార్నియల్ అంధత్వరహిత తెలంగాణ రాష్ట్రం కోసం సదాశయ ఫౌండేషన్ గత 14 సంవత్సరాలుగా కృషి చేస్తున్నదని చెప్పారు.ఈ అంధత్వ నివారణకు  మరణానంతరం మన0 చేసే నేత్రదానం వలన ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చు అన్నారు .చనిపోయిన వ్యక్తి ఇంటికే వచ్చి నేత్ర సేకరణ చేస్తారని తెలిపారు.కాబట్టి మరణానంతరం మనకు ఎందుకూ ఉపయోగపడని శరీర బాగాలను దానం చేసి మానవ జన్మను ధన్యం చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.