నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ డబ్బులు సమకూర్చిందని ఆరోపించారు. పంజాబ్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత కూడా రూ 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణాలు జరిగాయంటూ కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.