నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహా సమ్మేళనం సమ్మక్క- సారలమ్మ జాతర. కోటికి మందికి పైగా భక్తులు వస్తారు. 1996 లో ఈ జాతరను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించగా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మేడారం జాతకు ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. వచ్చే సంవత్సరం 2024, ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి నాడు మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది. 21వ తేదీ మాఘశుద్ధ.. తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పిలువబడే మేడారం మహాజాతర వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుండి 28 తేదీల మధ్య మహాజాతర జరగనుంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ మహా జాతరలో ఆదివాసీ గిరిజన దైవాలుగా కొలువబడే సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు కోటిమందికి పైగా భక్తులు వస్తారు. 2024, ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి నాడు మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది. 21వ తేదీ మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గుడి మెలిగే పండుగతో పాటు సారలమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఆ రోజునుండే అసలైన మేడారం జాతర మొదలవుతుంది. 22వ తేదీ మాఘశుద్ధ త్రయోదశి గురువారం కంకవనం గద్దె మీదకు వచ్చుట, సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటారు. 23వ తేదీ మాఘ శత్రుదశి శుక్రవారం సమ్మక్క-సారలమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 24వ తేదీ మాఘశుద్ధ పౌర్ణమి శనివారం రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 28 మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజు తిరుగు వారం పండుగను నిర్వహిస్తారు. విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తారు. ప్రకృతితో మమేకమై ఈ గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నెపల్లి నుంచి సాలమ్మను గద్దెలపైకి తీసుకురానున్నారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, ఎటునాగారం మండలం కొండాయి నుంచి గోవిందు రాజులను మేడారం గద్దెలపైకి పూజారులు తీసుకొస్తారు. 22న గురువారం.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి.. గద్దెలపై ప్రతిష్టిస్తారు. 23 శుక్రవారం.. వనదేవతలు గద్దెలపై కొలువు తీరుతారు. వనదేవతలు గద్దెల మీద కొలువుతీరిన రోజు నుంచి కోట్లాదిమంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. పసుపు, కుంకుమ, ఒడిబియ్యాన్ని బంగారాన్ని(బెల్లం) సమర్పిస్తారు. కోడిపుంజులు, మేకపోతులను బలిస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులను గాలిలో ఎగరవేసి ఆరగింపు చేస్తారు. 24న శనివారం.. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు మళ్లీ వన ప్రవేశం చేస్తారు. మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేస్తుంది. జాతరకు కొన్ని నెలల ముందు నుంచే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ మహా జాతరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా చతిస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 సంవత్సరం వరకు సిరిగల గుట్ట పై కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. కానీ 1940 తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. గిరిజనేతరులు కూడా జాతకుడు రావడం ప్రారంభించారు. అప్పటినుంచి మేడారం జాతర జరుగుతుంది.