ఆడపడుచు కట్నం అందజేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-ఆర్మూర్

రాఖి పండగ సందర్భంగా ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి మంగళవారం ఐకెపి మహిళలు, మెప్మా ఆర్పీలు ,ఫీల్డ్ అసిస్టెంట్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున రాఖీలు కట్టడానికి వచ్చిన మహిళ సోదరీమణులకు ఎమ్మెల్యే,, సతీమణి రజిత రెడ్డి దంపతులు ఆడపడుచు కట్నం గా చీరలను అందజేసి కృతజ్ఞత చాటుకున్నారు.