జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ర్యాలీ

నవతెలంగాణ-ఆర్మూర్

మేజర్ ద్యాన్ చంద్ హాకీ క్రీడా కారుడు జన్మదినమును పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం ను లయన్స్ క్లబ్ అఫ్  నావనాథ్ పురం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించినారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులచే హౌజింగ్ బోర్డు పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలి నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ భరత్ తరపున ఒలింపిక్స్ పాల్గొని మూడు బంగారు పథకాలు సాధించారు. ఆయన క్రీడా నైపుణ్యం ను చూసి ఆడాల్ఫ్ హిట్లర్ తన దేశ పౌరసత్వం ఇచ్చి గౌరవ ప్రధమైన ఉన్నత స్థాయి ని కల్పిస్తామని కబురు పంపగా, ఆ ప్రతిపాదమును తీరష్కరించి నా దేశం కోసం పాటుపాడుతానని దేశభక్తిని వ్యక్తర్చిన గొప్ప దేశభక్తిగల వ్యక్తి అని అన్నారు. వ్యాయమా ఉపాధ్యాయులు భాగ్య, జాతీయ క్రీడాకారుడు అరవింద్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రీథ్వీ రాజ్,పుప్పాల శివరాజ్, రూపాలి నర్సయ్య, జ్ఞానీ చావుల, లోచర్ చంద్రశేఖర్, శ్రీకాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.