ఆశా వర్కల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే బీగాల క్యాంప్ ఆఫీసు వద్ద ధర్నా

నవ తెలంగాణ-కంఠేశ్వర్
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి అనంత వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడి తట్టుకొని నిత్యం సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డ్స్, రివార్డ్ పొందారు. కనీస వేతనం నిర్ణయం చేయాలని ఆందోళన చేస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ అందరిని రోడ్ మీద పడి వేశారు. కనీస వేతనం రూ.18000 వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని తెలియచేశారు.సెప్టెంబర్ 5న ఆశ డే సందర్భంగా పి హెచ్ సి ముందు ధర్నా, సెప్టెంబర్ 11న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నము ప్రభుత్వము వెంటనే చర్చించి నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా రిస్క్ అలవెన్స్ తన ఖాతాలో వేసుకుంది కానీ విడుదల చెయ్యటానికి చేతులు రావటం లేదు. పిి ఆర్ సి ఎరియర్ ఇవ్వకుండా అందరికీ కంటే ఎక్కువ జీతం ఇస్తున్నామని హరీష్ రావు గారు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిక్స్డ్ వేతనం రూ.10000 అమలు చేస్తున్నారు.కేరళ రాష్ట్రలో 18000/- ఇస్తున్నారు. ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో కనీసం ప్రమాద భీమా సౌకర్యం పొందలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. హరీష్ రావు గారు తప్పుడు ప్రకటనలు బంద్ చేసి హెల్త్ రంగంలో పనిచేస్తున్న ఫ్రెంట్ లైన్ కార్మికులను పర్మినెంట్ చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడిన మహిళ సైనికులు ఆశా కార్యకర్తలు.కంటి వెలుగు,లెప్రసీ,మలేరియా, టిబి గుర్తింపు కార్యక్రమంలో అత్యున్నత పాత్ర వహించారు. కానీ వారికి బిల్లులు మంజూరు చెయ్యలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది.మనసున మహారాజుకి చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా కడుపులు ఎండబెట్టడం ఎలాంటి మనస్సూ గుర్తించాలని కోరారు.దొర అహంకారం అనేది నిలువునా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవాలి అని కోరారు.
సెప్టెంబర్ 5 పిఎసి ముందు ధర్నా, సెప్టెంబర్ 11న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో సుకన్య రేవతి లలిత రేణుక స్రవంతి నర్సా శోభ తదితరులు పాల్గొన్నారు.