– చాప బాబు దొర డిటిఎఫ్ రాష్ట్ర బాధ్యులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగుల శాంతియుత ర్యాలీకి డిటిఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని డిటిఎఫ్ రాష్ట్ర బాధ్యులు చాప బాబు దొర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో సమగ్ర శిక్షణ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం నిర్వహిస్తున్న శాంతియుత ర్యాలీకి డిటిఎఫ్ మద్దతు ఆకాంక్షించారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల వినతి మేరకు వారి శాంతి ర్యాలీకి డిటిఎఫ్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని బాబు దొర అన్నారు. ఈ సందర్భంగా బాబు ద్వారా మాట్లాడుతూ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ , ఎం ఐ ఎస్ సి ఓ, సిఆర్పిఎస్, ఐ ఈ ఆర్ పి ఎస్, కేజీబీవీ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది, పి టి ఎస్, మెసెంజర్స్, డిపిఓ సిబ్బంది గత 15 సంవత్సరాల పైబడి చాలీచాలని వేతనాలతో దుర్భర పరిస్థితుల్లో కొలువు చేస్తున్నారని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్ల కొరకు నిర్వహిస్తున్న శాంతియుత ర్యాలీకి జిల్లా వ్యాప్తంగా డీటీఎఫ్ ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ కార్యదర్శి వై కన్నయ్య సభ్యులు బి సూర్య మరియు సమగ్ర శిక్షణ ఉద్యోగులు భూరెడ్డి విష్ణు, బిక్షపతి, చందు, రజిత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.