నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

– కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మన్సూర్
నవతెలంగాణ- కోటగిరి
నాగర్ కర్నూలు బిఆర్ఎఎస్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి మూడు రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే కాల్చి పడేస్తా అనడం, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా రోడ్ల మీద తిరుగులేరని  బహిరంగంగా హెచ్చరించడం పట్ల బుధవారం కోటగిరి ఉమ్మడి మండలం యువజన నాయకులు కోటగిరి  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు  ప్రజాప్రతినిధి  ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్తారని ఎమ్మెల్యే మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ చట్టపరమైన చర్య తీసుకోవాలని యువజన కాంగ్రెస్ తరుపున పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్  కోటగిరి, పోతంగల్ మండల నాయకులు పుప్పాల అభిషేక్, హన్మంత్,యాదుల్, అగార్కర్,అహ్మద్, అందాన్ తదితరులు పాల్గొన్నారు