
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గోవర్ధన్ రాఖీ కట్టిన తన సోదరీమణి శారద, అలాగే రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గోవర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందన్నారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని వివరించారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు.