శ్రీలంక ఘన విజయం

– ఆసియా కప్‌ 2023
పల్లెకల్‌: ఆసియా కప్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొం దింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 164 పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో శ్రీలంక 39 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. చరిత్‌ అసలంక (62 నాటౌట్‌, 92 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు.