– హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్థానిక కోటాలో మెడికల్ ప్రవేశాల కోసం స్థానికత్వ ధ్రువీకరణ పత్రాల జారీకి ఎమ్మార్వోల చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్లు దాఖలయ్యాయి. గత రెండేండ్లుగా నివాసం ఉంటున్నారంటూ, ఇంటి వివరాలతో ధ్రువీకరణ పత్రం ఇస్తున్నారనీ, దరఖాస్తుదారుడు తెలంగాణ వ్యక్తి అవునో కాదో తేల్చడం లేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్లు కోరుతున్నట్టు నివాస ధ్రువీకరణపత్రాలు ఇచ్చేందుకు ఎమ్మార్వోలు ప్రయత్నించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ అశోక్ ఆరాధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. వేరే రాష్ట్రాల్లో చదివిన అభ్యర్థులకు ఇచ్చిన స్థానిక నివాస ధ్రువీకరణ పత్రాల్లో ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారో పేర్కొన్నారనీ, స్థానికత గురించి పేర్కొనలేదని గుర్తు చేసింది. దీని వల్ల తెలంగాణ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పింది. సీఎస్ ద్వారా ఎమ్మార్వోలకు స్థానిక ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని చెప్పింది.