– బీఆర్‌ఎస్‌కే ఓట్లు వేస్తామని తీర్మానించటం రాజ్యాంగ విరుద్దం :మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, నిరంజన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్‌కే ఓట్లు వేస్తామంటూ గ్రామపంచాయతీల్లో తీర్మానించిన సర్పంచులు, ఉప సర్పంచులను వెంటనే సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉపాధ్యక్షులు జి నిరంజన్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పరిధిలోని కొన్ని గ్రామాల సర్పంచులు ఈ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని విమర్శించారు. అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాష్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమనీ, ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తీర్మానాలను సమర్ధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లీగల్ నోటీసులు ఇవ్వాలని కోరారు.