నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్ రిసోర్స్ ప్లాన్‌ను డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి సమర్పించాయి. 5, 6 వ నియంత్రిత కాలాలకు సంబంధించిన ప్రణాళికల్ని వేర్వేరుగా ఇచ్చారు. 2024-25 నుంచి 2028-29 వరకు 5వ నియంత్రణ కాలంగా, 2029-30 నుంచి 2033-34 వరకు 6వ నియంత్రణ కాలంగా పేర్కొన్నారు. 5వ నియంత్రణ కాలంలో మొత్తం విద్యుత్ అమ్మకాలు – 66,012 మిలియన్ యూనిట్లు కాగా, 6వ నియంత్రణ కాలంలో మొత్తం విద్యుత్ అమ్మకాలు – 88,689 మి.యూ.,గా లెక్కించారు. వరుస నియంత్రణ కాలాల్లో నష్ట అంచనా 3.56 శాతం – 3.53 శాతంగా నిర్ణయించారు. పంపిణీ నష్టాలు 10.36 శాతం – 10.14 శాతంగా లెక్కించారు. విద్యుత్ అవసరాలు – 2028-29 నాటికి 1,05,957 మి.యూ., 2033-34 నాటికి 1,40,637 మి.యూ.,కాగా, విద్యుత్ లభ్యత – 2028-29 నాటికి 1,22,090 మి.యూ., 2033-34 నాటికి 1,14,657 మి.యూ.,ఉంటుందని అంచనా వేశారు. ఈ నివేదికపై టీఎస్ ఈఆర్సీ పరిశీలన చేసి, బహిరంగ విచారణ నిర్వహించాల్సి ఉంటుంది.