ప్యూచర్‌స్కిల్స్‌ ఫ్రైమ్‌తో సర్వీసునౌ భాగస్వామ్యం

న్యూఢిల్లీ: నాస్కామ్‌ మీటీ కార్యక్రమం ఫ్యూచర్‌స్కిల్స్‌ ఫ్రైమ్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు సర్వీస్‌నౌ వెల్లడించింది. దీంతో 2024 చివరి నాటికి పది లక్షల మందికి నైపుణ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రముఖ డిజిటల్‌ వర్క్‌ఫ్లో కంపెనీ సర్వీస్‌నౌ ఇండియా వెల్లడించింది. భారతదేశం అంతటా 5,000 మంది అభ్యాసకులకు కొత్త డిజిటల్‌ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. వేగంగా అభివద్ధి చెందుతున్న నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న రివార్డింగ్‌ కెరీర్‌లను నిర్మించడానికి ఈ భాగస్వామ్యం స్పష్టమైన మార్గాలను అందిస్తుందని తెలిపింది.