నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శనివారం చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ పనులను పరిశీలించారు. జంటనగరాల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్ టెర్మినల్‌గా అవతరించనుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దీని అభివృద్ధి కోసం రైల్వే బోర్డు సవరించిన అంచనా వ్యయంతో రూ.221 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్లో చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి రూ.82 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.