కరెంట్‌ అఫైర్స్‌

జపాన్‌తో కలిసి మరో చంద్ర మిషన్‌ : ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ (జాక్సా) సహకారం తో మరో చంద్రమిషన్‌ కు సిద్ధమవుతుంది. 2024 – 25 లో ఎల్‌యుపిఇఎక్స్‌ (లూనార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌) గా పిలువబడే ఈ మిషన్‌ చంద్రుని ఉపరితలంపై పరిశోధన చేయడానికి ఉద్దేశించబడినది. జపాన్‌ ఏరోస్పేస్‌ ఏజెన్సీ (జె.ఎ.ఎక్స్‌.ఎ) ను అక్టోబర్‌1, 2003 లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం చోపు, టోక్యో, జపాన్‌.
చేపల పెంపకం, ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం : చేపల పెంపకం, ఉత్పత్తిలో తెలంగాణ మొదటిస్థానంలో వుంది. రాష్ట్రంలో మత్య్స సంపదను 1.98 లక్షల టన్నుల నుంచి 4.24 లక్షల టన్నులకు పెరిగింది. 2023 సంవత్సరానికి ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ ఆగస్టు 26 నుండి తెలంగాణలో ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఈ సంవత్సరం 26,357 నీటి వనరుల్లో 84,13 కోట్లలో 85.60 కోట్ల చేప పిల్లలను 300 నీటి వనరుల్లో 25.99 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనుంది.
లీటర్‌ లోపు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేదించిన అస్సాం : రాష్ట్రంలో 1000 మిల్లీ లీటర్ల కంటే తక్కువ సామర్థ్యం వున్న ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వాడకం ఉత్పత్తిపై నిషేదం విధిస్తున్నట్లు అస్సాం పర్యావరణ అటవీ శాఖ ప్రకటించింది. ఈ నిషేదం అక్టోబర్‌ 2 నుండి అమలులోకి వస్తుంది. 1 లీటర్‌ కంటే తక్కువ వాల్యూమ్‌తో పాలిథిలిన్‌ టెరెఫ్రాలెట్‌ (పి.ఇ.టి)తో తయారు చేసిన తాగునీటి బాటిళ్ల ఉత్పత్తి, వినియోగాన్ని నిషేదించే ఉద్దేశ్యాన్ని ప్రకటించింది.
ఇ.సి. జాతీయ ఐకాన్‌గా సచిన్‌ టెండుల్కర్‌ : భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ఎన్నికల కమిషన్‌ (ఇ.సి.) నేషనల్‌ ఐకాన్‌గా మారి ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యం ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు. ఎన్నికల సంఘం సంచిన్‌తో 3 సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో సచిన్‌కు వున్న ప్రజాదరణ, పలుకుబడి ఎన్నికల ప్రక్రియపై సానుకూల ప్రభావం చూపడం ఖాయమని ఎన్నికల సంఘం భావిస్తుంది. నటుడు పంకజ్‌ త్రిపాఠిని జాతీయ ఐకాన్‌గా గత ఏడాది నియమించింది. క్రికెటర్‌ మహీంద్రసింగ్‌ ధోని, నటుడు అమిర్‌ఖాన్‌, బాక్సర్‌ మేరికోమ్‌ జాతీయ ఐకాన్‌లుగా వ్యవహరించినవారే.
థారులాండ్‌ ప్రధానిగా శ్రేతాతవీసిన్‌: థారులాండ్‌ కొత్త ప్రధానిగా శ్రేతా తవీసిన్‌ ఎన్నికయ్యారు. అసెంబ్లీలో మూడింట రెండొంతుల మద్దతుతో పార్లమెంటరీ ఓటింగ్‌లో 60 ఏళ్ల తవీసిస్‌ విజయం సాధించడంతో 100 రోజుల క్రితం జరిగిన ఎన్నికల తర్వాత వారాల తరబడి నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర పడింది.
క్లీన్‌ ఎయిర్‌ సర్వేలో గుంటూరు 3వ స్థానం : భారతదేశంలో పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌.సి.ఎ.పి) లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఎయిర్‌ సర్వేలో గుంటూరు 3వ స్థానంలో నిలిచింది. 10 లక్షల జనాభా గల నగరాల విభాగంలో మహరాష్ట్రలోని అమరావతి మొదటిస్థానంలో నిలవగా ఉత్తర ప్రదేశ్‌లోని మెరాదాబాద్‌ 2వ స్థానంలో నిలిచింది. ఈ ఎన్‌సి.ఎపి సర్వేలో 131 నగరాలు పాల్గొన్నాయి. ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ అవార్డుల వేడుక సెప్టెంబర్‌ 7న మధ్యప్రదేశ్‌లోని బీహార్‌లో జరగనుంది.
ఒడిశాలో ఉత్కెలా విమానాశ్రయాన్ని ప్రారంభించిన విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా : ఆగస్టు 31, 2013 న కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఒడిశాలో ఉత్కెలా విమానాశ్రమాన్ని ప్రారంభించారు. ఇది ప్రతిష్టాత్మక ఉడాన్‌ (ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌) పథకంలో భాగంగా ప్రారంభించడం జరిగింది.
సింగపూర్‌ అధ్యక్షుడిగా భారత్‌ సంతతికి చెందిన షణ్ముగరత్నం : భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త ధర్మన్‌ షణ్ముగరత్నం (66) సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. షణ్ముగరత్నంపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. అయితే ఈయన ఏకంగా 7.4 శాతం ఓట్లలో విజయం సాధించి సింగపూర్‌ 9వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545