నవతెలంగాణ-గంగాధర: గంగాధర మండలం కొండాయపల్లి గ్రామానికి చెందిన బండారి మణెమ్మ అనే నిరుపేద వృద్దురాలు సోమవారం మరణించగా, ఆమె దహన సంస్కారాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రూ.5 వేలు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఒడ్నాల యఘ్నేశ్ రూ. 5 వేలను మృతురాలి కుటుంబ సభ్యులకు అందించారు. అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్ రమణ రెడ్డి రూ. 2500 ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి రూ. 2500 లను ఆర్ధిక సహాయం చేశారు. గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మ నేడు తుది శ్వాస వదిలింది. దీంతో మణెమ్మ మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించే ఆర్థిక స్థోమత లేని కుటుంబ సభ్యులకు దాతలు ఆర్థిక సాయం చేశారు. వీరి వెంట బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్యాల బాబు, ఉప సర్పంచ్ బండపల్లి ఆనందం, మల్యాల వినయ్, సాగర్, మాచర్ల లచ్చగౌడ్, కుమారస్వామి ఉన్నారు.