నవతెలంగాణ – గంగాధర: దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత సంఘాల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. దళిత బంధుతోపాటు దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీఠ వేసిందన్నారు. చొప్పదండి శాసనసభ నియెాజక వర్గంలో మరోసారి ఎగిరెది గులాబీ జెండానేనని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడబొడ్డున 150 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ఏకైక సీఎం కేసిఆర్ అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ అనే విషయం గ్రహించాలని సూచించారు. దళితుల విదేశీ విద్యకు స్కాలర్ షిప్ అందించడం, నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళితుల ఔనత్యాన్ని చాటిన ఘనత కేసీఆర్ కేసీఆర్ దక్కిందన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి నియెాజక వర్గంలో ఆరు మండలాలకు చెందిన దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.