పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, డి ఈ ఓ కి వినతి

– 13న చలో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి 
– తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి – మల్యాల గోవర్ధన్ పిలుపు
నవతెలంగాణ-కంటేశ్వర్ : పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఈనెల 13న చలో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు.
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ కి వినతి పత్రం సోమవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. సిఐటియు పోరాట ఫలితంగా ఒకటి నుండి 8వ తరగతి వరకు జూలై నెల వరకు బిల్లులు విడుదల అయ్యాయని అన్నారు, 9, 10 తరగతు లకు సంబంధించి గుడ్ల బిల్లులు మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ లో ఉన్న పిల్లలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, విద్యాశాఖ మంత్రి గారు జూలై నుండి నెల నుండి 3000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పినప్పటికీ అందుకు అనుగుణంగా బడ్జెట్ విడుదల చేయలేదని అన్నారు, కొత్త మెనూ అమలు కోసం, రాగి జావా వండి పెట్టాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని తెలిపారు, ఈ విషయంలో జిల్లా అధికారులకు సైతం ఎటువంటి స్పష్టత లేకపోయినా, కొత్త మెనూ అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని అన్నారు,
పెండింగ్ బిల్లుల సాధన కోసం, 3000 రూపాయల గౌరవ వేతనం, ఏరియర్స్ తో సహా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న చలో విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్, కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కోకన్వీనర్ ధ్యారంగుల కృష్ణ, మధ్యాహ్న భోజన యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, నాయకులు సురేందర్ రెడ్డి, నాగమని, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.